Wednesday, January 1, 2020

దర్శకుడి చేతిలో 200 కోట్లు పెట్టిన ప్రభాస్


దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తర్వాత అంతటి స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇందుకు ఆయన తెరకెక్కించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమానే కారణం. అయితే త్వరలో సురేందర్ రెడ్డి.. యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్‌తో కలిసి ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఈ మేరకు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ప్రభాస్‌కు చెందిన నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సురేందర్ రెడ్డి చేతిలో 200 కోట్ల రూపాయలను పెట్టినట్లు తెలుస్తోంది. రాధాకృష్ణతో కలిసి ప్రస్తుతం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్)తో బిజీగా ఉన్న ప్రభాస్‌తో సినిమా చేయాలని సందీప్ రెడ్డి వంగా, కొరటాల శివ లైన్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే సందీప్ రెడ్డి వంగాతో సినిమాపై ఇటీవల ప్రభాస్ టీం క్లారిటీ ఇచ్చింది. అందులో ఎంత మాత్రం నిజం లేదని తెలిపింది. ఇక ప్రభాస్, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్‌లో ఎంత నిజం ఉందో తెలియాంటే మరో క్లారిఫికేషన్ రావాలి. మరోపక్క కొద్ది రోజులుగా ఓ సినిమాలో నటించేందుకు ప్రభాస్‌కు భారీ రెమ్యూనరేషన్‌ అందుకోబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రభాస్‌కు 75 కోట్ల రెమ్యూనరేషన్‌ ఆఫర్‌ చేసినట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలు రూమర్స్‌ అంటూ కొట్టి పారేస్తున్నారు ప్రభాస్‌ టీం. డార్లింగ్‌ పారితోషికానికి సంబంధించి వస్తున్న వార్తలన్నీ ఫేక్‌ అంటూ క్లారిటీ ఇచ్చారు

No comments: